జగన్మోహన్ రెడ్డి...దాగుడు మూతల దండాకోర్: బండారు

ABN , First Publish Date - 2021-02-06T18:41:46+05:30 IST

కేంద్రంతో సంబంధం పెట్టుకున్న దాగుడు మూతల దండాకోర్.. జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి...దాగుడు మూతల దండాకోర్: బండారు

విశాఖపట్నం: కేంద్రంతో సంబంధం పెట్టుకున్న దాగుడు మూతల దండాకోర్.. జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లడుతూ విశాఖపట్నం తగలబడి పోతుంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రం గురించి ఎంపీలు మాట్లాడొద్దని, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ప్రభుత్వం కూడా భాగస్వామి అని..భూసేకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఆర్ అండ్ ఆర్ ఇచ్చింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే అని గుర్తు చేశారు. 28 మంది ఎంపీలు గాడిద పళ్లు  తోముతున్న రా.. అంటూ అసెంబ్లీ కాల్ ఫర్ చేయాలని డిమాండ్ చేశారు.  కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పట్టబట్టారు.  ‘‘ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే.. మా ఎంపీలు రాజీనామా చేస్తారు. మీ ఎంపీలను రాజీనామా చేయించండి’’ అంటూ ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ద్రోహి అంటే గూగుల్‌లో జగన్ మోహన్ రెడ్డి ఫోటో వచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదన్నారు. ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని కాకుండా అన్ని ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల కేటాయింపులో  విఫలమయ్యాయని బండారు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-02-06T18:41:46+05:30 IST