మాజీ మంత్రి ‘బండారు‘ హౌస్ అరెస్టు
ABN , First Publish Date - 2021-10-21T06:15:06+05:30 IST
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని బుధవారం ఉద యం పరవాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పరవాడ, అక్టోబరు 20: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని బుధవారం ఉద యం పరవాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, రాష్ట్రం లోని పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు మంగళవారం చేపట్టిన దాడులకు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తి బుధవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తన వాహనంలో బయటకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. పరవాడ సీఐ పి.ఈశ్వరరావు తమ సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లడానికి వీళ్లేదని, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నామని సీఐ వివరించారు. దీంతో బండారు వాహనం దిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. సీఐ తమ సిబ్బందిని బండారు ఇంటి గేటు వద్ద కాపలాగా ఉంచారు.