ద్రోణంరాజు కప్ ఫుట్‌బాల్ టోర్నీ
ABN , First Publish Date - 2021-02-06T06:23:18+05:30 IST
విశాఖనగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో స్టార్ ఫ్లెక్స్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహిస్తున్న ‘ద్రోణంరాజు శ్రీనివాస్ స్మారక 9ఏ సైడ్ ఫుట్‌బాల్’ పోటీలు సెమీఫైనల్ దశకు చేరుకున్నాయి.

సెమీస్‌కు నాలుగు జట్లు
విశాఖపట్నం (స్పోర్ట్సు), ఫిబ్రవరి 5: విశాఖనగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో స్టార్ ఫ్లెక్స్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహిస్తున్న ‘ద్రోణంరాజు శ్రీనివాస్ స్మారక 9ఏ సైడ్ ఫుట్‌బాల్’ పోటీలు సెమీఫైనల్ దశకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో మహముద్దీన్ స్పోర్టింగ్ క్లబ్ 5-4 గోల్స్ తేడాతో ఎంఎంఎఫ్‌సీపై, మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీసీఎఫ్‌ఏ 5-4 గోల్స్ తేడాతో డాన్ మెమోరియల్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరాయి.
మరో గ్రూప్‌లోని తొలి క్వార్టర్‌లో శబరి స్పోర్టింగ్ క్లబ్ 2-0 గోల్స్‌తో విజ్జీస్ అకాడమీ గెలుపొందింది. శబరి క్లబ్‌లో ఎం.శ్రీహరి రెండు గోల్స్‌చేసి జట్టుకు విజయాన్నందించాడు. చివరి మ్యాచ్‌లో పోలమాంబ ఎస్‌సీ 3-1 గోల్స్ తేడాతో బ్లూ స్టార్‌పై గెలుపొందింది. పోలమాంబ జట్టులో ప్రసాద్ రెండు, ఎం.శ్రీను ఒక గోల్ సాధించారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జీహెచ్‌ఎంసీ రిటైర్డ్ అడిషినల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫుట్‌బాలర్ ప్రసాదరావు (నందు), కొండలరావు, ఎస్‌జీ.రామకృష్ణ, వై.శ్రీనివాసరావు, రమణయ్య, టోర్నీ నిర్వాహకులు త్రినాధరావు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.