సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-10-30T05:01:33+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ నిర్లక్ష్య వైఖరితో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శించారు. పార్టీ జిల్లాశాఖ ఆదేశాలమేరకు భీమిలి జోనల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కంటుభుక్త రామానాయుడు, పార్టీ అర్బన్‌ అధ్యక్షురాలు కంటుభుక్త సునీత ఆద్వర్యంలో దర్నా నిర్వహించారు.

సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
జడ్సీ రమణకు వినతిపత్రం అందిస్తున్న బీజేపీ నేతలు

అధికారుల తీరుపై భారతీయ జనతా పార్టీ నేతల ధర్నా 

భీమునిపట్నం, అక్టోబరు 29: మహా విశాఖ నగరపాలక సంస్థ నిర్లక్ష్య వైఖరితో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శించారు.  పార్టీ జిల్లాశాఖ ఆదేశాలమేరకు భీమిలి జోనల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కంటుభుక్త రామానాయుడు,  పార్టీ అర్బన్‌ అధ్యక్షురాలు కంటుభుక్త సునీత ఆద్వర్యంలో  దర్నా నిర్వహించారు. జీవీఎంసీలో అపరిశుభ్రత తాండవిస్తోందని దీంతో  డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా విజృంభిస్తున్నాయన్నారు. చిన్నబజారులోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా జోనల్‌ కార్యాలయానికి వెళ్లి జోనల్‌ కమిషనర్‌ ఎస్‌వీ రమణకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి శ్రీహరి, ఉప్పాడ అప్పారావు, బూర అశోక్‌కుమార్‌, కురిమిళ్ల కవిత, పాలుబోతు విజయ, అవనాపు రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:01:33+05:30 IST