నేరాల నియంత్రణపై దృష్టిసారించండి

ABN , First Publish Date - 2021-07-24T06:03:39+05:30 IST

జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని విశాఖ రూరల్‌ జిల్లా అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ సూచించారు.

నేరాల నియంత్రణపై దృష్టిసారించండి
రికార్డులు పరిశీలిస్తున్న అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ

అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ


అనకాపల్లి టౌన్‌, జూలై 23: జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని విశాఖ రూరల్‌ జిల్లా అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ సూచించారు. స్థానిక సీసీఎస్‌, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లను శుక్రవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం దొంగతనాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాలు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో డీఎస్పీ మూర్తి, సీఐ రంగనాథం పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T06:03:39+05:30 IST