విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-14T06:19:51+05:30 IST

పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో గల ఓ ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
ఇంటి నుంచి వస్తున్న పొగలు

వేణుగోపాలస్వామి ఆలయ సమీప ఇంట్లో చెలరేగిన మంటలు

సమారు రూ.ఆరు లక్షలు ఆస్తి నష్టం 

ఎలమంచిలి, అక్టో బరు 13: పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో గల ఓ ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. శతకం పట్టు వద్ద గల ఇంట్లో చిరువ్యాపారి లంక కృష్ణ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. బుధవారం టీవీ దగ్గర షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఇల్లంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తం భద్రపర్చిన నగదుతో పాటు కొంత బంగారం, వెండి కాలి బూడిదయ్యింది. మంటలు అదుపు చేసేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక శకటం వచ్చినప్పటికీ ప్రమాదం జరిగిన ఇంటి సమీపంలో నిర్మాణ సామగ్రి అడ్డుగా ఉండడంతో అక్కడే నిలిచిపోయింది. చివరకు అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు రాగలిగారు. ఈ సందర్భంగా బాధితుడు కృష్ణ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇంట్లో శుభకార్యం నిర్వహణకు ఉంచిన నగదు, వస్తు సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయని వాపోయారు. సుమారు ఆరు లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు చెప్పారు.

Updated Date - 2021-10-14T06:19:51+05:30 IST