కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాటం
ABN , First Publish Date - 2021-08-26T05:26:14+05:30 IST
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాటాలు తప్పవని టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
గాజువాక, ఆగస్టు 25: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాటాలు తప్పవని టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న గ్రామ చైతన్య సభ బుధవారం జీవీఎంసీ 74వ వార్డు దల్లివానిపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న ధర్మ పోరాటాలకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు, నాయకులు కోన సోమినాయుడు, వియ్యపు కొండబాబు, నంబాల గణపతి, సూర్యనారాయణ, నంబాల సురేష్, పాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.