‘భూ రాబందులు’పై రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-08-21T05:55:27+05:30 IST

జేపీ అగ్రహారం భూములకు సాగులో లేని వారికి పాస్‌ పుస్తకాల జారీపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

‘భూ రాబందులు’పై రైతుల ఆందోళన

కలెక్టర్‌, ఆర్డీవోలకు ఫిర్యాదు చేయడానికి సమాయత్తం


రోలుగుంట, ఆగస్టు 20: జేపీ అగ్రహారం భూములకు సాగులో లేని వారికి పాస్‌ పుస్తకాల జారీపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై శనివారం నర్సీపట్నం ఆర్డీవోను, సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా, కోర్టులో కేసు ఉన్నా తొమ్మిది మందికి 125 ఎకరాలకు పాస్‌ పుస్తకాల జారీపై ఈ నెల 18న ‘జేపీ అగ్రహారంలో భూ రాబందులు’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో సాగు రైతులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా రైతులు రొంగలి వెంకునాయుడు, రొంగలి తాతినాయుడు, సన్యాసినాయుడు తదితరులు మాట్లాడుతూ, ఇనాం టీడీ నెం.47 గ్రామంగా సర్వే సెటిల్‌మెంట్‌ అయ్యిందని, ఇక్కడ భూములకు రైతులే అనుభవదారులని చెప్పారు. 1948-50లోనే సెటిల్మెంట్‌ తీర్చు ఇచ్చిందన్నారు. రెవెన్యూ అధికారులు కొంత మంది వ్యక్తుల పేర్ల మీద ఈ-పాసు పుస్తకాలు జారీ చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.

Updated Date - 2021-08-21T05:55:27+05:30 IST