దిశ యాప్‌పై విస్తృత ప్రచారం
ABN , First Publish Date - 2021-08-25T05:48:33+05:30 IST
మండల కేంద్రమైన ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎస్.రాయవరం స్టేషన్ సిబ్బందికి ఎస్పీ కృష్ణారావు ఆదేశం
ఎస్.రాయవరం, ఆగస్టు 24 : మండల కేంద్రమైన ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రికార్డులతో పాటు రిసప్షన్ కౌంటర్‌ను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిశ యాప్‌పై పల్లెల్లో సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిం చాలని సీఐ నారాయణరావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లను ఆదేశించారు. ఆపదలో ఉన్న మహిళలకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయం అం దరికీ తెలియజెప్పాలన్నారు. ఇందు కోసం గ్రామ సచివాలయల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవ హరించాలని ఆదేశించారు.