ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-19T04:40:44+05:30 IST

కరోనా వల్ల ప్రయాణికుల సంఖ్య బాగా తక్కువగా ఉన్నందున ప్రత్యేక రైళ్ల రద్దును పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగింపు

విశాఖపట్నం, మే 18(ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల ప్రయాణికుల సంఖ్య బాగా తక్కువగా ఉన్నందున ప్రత్యేక రైళ్ల రద్దును పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ అధికారులు తెలిపారు.

08516/515 విశాఖపట్నం-కిరండోల్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. 

08445/446 భువనేశ్వర్‌ - జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు.

08528/527 విశాఖపట్నం- రాయపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు రద్దు చేశారు.

08301 సంబల్‌పూర్‌-రాయగడ రైలును టిట్లాఘర్‌ వరకే నడుపుతారు. 24, 25, 26, 27, 28, 31 తేదీల్లో ఉంటుంది. ఈ రైలు తిరిగి టిట్లాఘర్‌ నుంచి బయలుదేరుతుంది.


Updated Date - 2021-05-19T04:40:44+05:30 IST