ఉత్సాహంగా రంగోత్సవ పోటీలు
ABN , First Publish Date - 2021-12-30T06:00:05+05:30 IST
ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ( భీమిలి డైట్‌లో) బుధవారం జిల్లాస్థాయి రంగోత్సవ పోటీలు ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగాయి. జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 120 మంది (ఒకటి నుంచి 8వ తరగతి) విద్యార్థినీ, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.

భీమునిపట్నం, డిసెంబరు 29: ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ( భీమిలి డైట్‌లో) బుధవారం జిల్లాస్థాయి రంగోత్సవ పోటీలు ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగాయి. జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 120 మంది (ఒకటి నుంచి 8వ తరగతి) విద్యార్థినీ, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. హ్యాండ్ రైటింగ్, కలరింగ్, కార్టూన్ మేకింగ్, గ్రీటింగ్ కార్డుల తయారీలో పోటీలను నిర్వహించారు. కలరింగ్‌లో పి.దుర్గమ్మ, పీఎన్‌ఎంఈ స్కూల్, భీమిలి (ప్రథమ), జె.మనస్విని, వెంకటాపురం, చినగదిలి మండలం (ద్వితీయ), కె.సాగర్‌కుమార్, ఎంపీయూపీ, చిన ఉప్పాడ, భీమిలి (తృతీయ) స్థానాల్లో నిలిచారు. హ్యాండ్ రైటింగ్‌లో పి.యశ్వంత్, జీహెచ్‌ఎస్, భీమిలి (ప్రఽథమ), బి.నమీషా, ఏపీఆర్‌ఎస్, భీమిలి (ద్వితీయ), ఆర్.జోశ్న, చిట్టివానిపాలెం (తృతీయ), కార్టూన్ మేకింగ్‌లో పి.లక్ష్మీలహరి, ఏపీఆర్‌ఎస్, భీమిలి (ప్రఽథమ), జి.జ్యోత్స్న, జీవీఎంసీ 2వ వార్డు స్కూల్, భీమిలి (ద్వితీయ), ఆర్.స్వరూప్, ఎంపీయూపీ, చిన ఉప్పాడ (తృతీయ), గ్రీటింగ్ కార్డు తయారీలో ఎన్.మేఘన ఏపీఆర్‌ఎస్, భీమిలి (ప్రథమ), ఇ.జాహ్నవి, జడ్పీహెచ్‌ఎస్, వెంకటాపురం (ద్వితీయ), కె.భువనేశ్వరి, జీవీఎంసీ రైల్వే న్యూకాలనీ (తృతీయ) స్థానాలలో నిలిచారు. విజేతలకు డైట్ ప్రిన్సిపాల్ యు.మాణిక్యంనాయుడు నగదు బహుమతులు అందజేశారు. ప్రథమస్థానంలో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. న్యాయ నిర్ణేతలుగా వైస్ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్, అధ్యాపకులు ఎ.గౌరీశంకర్, జీజీఎస్ నాగేశ్వరరావు వ్యవహరించారు.