దోచుకోవడమే తప్ప.. అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2021-12-19T06:15:53+05:30 IST

ప్రజా సమస్యలపై చర్చించేందుకు త్వరలో గ్రామాల్లో చేపట్టనున్న టీడీపీ గౌరవ సభలను పార్టీ శ్రేణులు విజయ వంతం చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వం గలపూడి అనిత కోరారు. శనివారం పాయకరావుపేటలో మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమా వేశంలో మాట్లాడారు.

దోచుకోవడమే తప్ప.. అభివృద్ధి శూన్యం
టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న వంగలపూడి అనిత

  


  వైసీపీ పాలనపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఆగ్రహం 

 గౌరవ సభల ద్వారా సమస్యలు తెలుసుకుంటామని వెల్లడి

పాయకరావుపేట, డిసెంబరు 18 : ప్రజా సమస్యలపై చర్చించేందుకు త్వరలో గ్రామాల్లో చేపట్టనున్న టీడీపీ గౌరవ సభలను పార్టీ శ్రేణులు విజయ వంతం చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వం గలపూడి అనిత కోరారు. శనివారం పాయకరావుపేటలో మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడ స్తున్నా ఎటువంటి అభివృద్ధి పనుల జర గలేదన్నారు. పేదలకు ఇచ్చే పింఛన్లు పెంచకపోగా, అర్హుల రేషన్‌ కార్డులు రద్దు చేస్తున్నారని వాపోయారు. ఆ పార్టీ పాలకులు ప్రజలను ఎలా దోచు కోవాలో ఆలోచిస్తున్నారే తప్ప,  ప్రజ లకు మంచి చేద్దామన్న ఆలోచన ఏకో శానలేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మంజూరైన ఇళ్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తామని డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. డబ్బులు ఎవరూ కట్టవద్దని, రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుం దని, పేదల ఇళ్లకు ఉచితంగా రిజి స్ట్రేషన్లు చేసి ఇస్తుందని తెలిపారు. అం తేకాకుండా డబ్బులు కట్టాలని ఎవ రైనా ఒత్తిడిచేస్తే టీడీపీ నాయకులకు తెలియజేయాలన్నారు. నాయకులు కంకి పాటి వెంకటేశ్వరరావు, దేవవరపు రాజ బాబు, గణపర్తి రాజబాబు, బొంది కాశీ వ్వినాథం, పల్లా విలియంకేరి, బుల్లిదొర, కురందాసు శివ, అప్పారావు, రమాకు మారి,  ధనలక్ష్మి,  నాగరాజు,  సతి ్తబాబు,  గోవిందు,  శ్రీను, సత్తి బాబు, కాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T06:15:53+05:30 IST