దాడులే తప్ప.. అభివృద్ధి జాడ లేదు

ABN , First Publish Date - 2021-02-05T07:14:03+05:30 IST

వైసీపీ అరాచక పాలనతో విసిగిపోతున్న ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు తెలిపారు.

దాడులే తప్ప.. అభివృద్ధి జాడ లేదు
మాకవరపాలెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బుద్ద

   వైసీపీ పాలన తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ బుద్ద

 స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం

మాకవరపాలెం, ఫిబ్రవరి 4 : వైసీపీ అరాచక పాలనతో విసిగిపోతున్న ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు తెలిపారు. గురువారం మాకవరపాలెం, శెట్టిపాలెం, రాచపల్లి, జి.కోడూరులలో టీడీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులను  అత్యధిక స్థానాల్లో గెలిపించి, పార్టీ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తామని చెప్పారు. దేవాలయాలపై, ప్రజలపై దాడులు తప్ప వైసీపీ పాలకులు చేసింది ఏమీ లేదన్నారు.  నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో అయ్యన్నపాత్రుడు చేసిన అభివృద్ధే తప్ప, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందో ఆ పార్టీ నాయకులే చెప్పాలన్నారు. టీడీపీ నాయకులు రుత్తల శేషుకుమార్‌, చింతకాయల రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-05T07:14:03+05:30 IST