నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-10-25T06:06:19+05:30 IST

ఏపీఐఐసీ నిర్వాసితుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఏపీఐఐసీ నిర్వాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుంగ్లాంలో ఆదివారం జరిగిన నిర్వాసితుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి
నిర్వాసితుల సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి

ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 24: ఏపీఐఐసీ నిర్వాసితుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఏపీఐఐసీ నిర్వాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుంగ్లాంలో ఆదివారం జరిగిన నిర్వాసితుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోనగర్‌ నిర్మాణానికి ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం 15 ఎకరాలు కేటాయించినప్పటికీ 18 ఏళ్లుగా వాటిని పంపిణీ చేయకపోవడం బాధాకరమన్నారు. తుంగ్లాం పరిసర గ్రామాల నిర్వాసితులు ఐక్యంగా ఇళ్ల పట్టాల కోసం ఉద్యమం చేయడం అభినందనీయమని అన్నారు. 69వ వార్డు కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి  మాట్లాడుతూ ఏపీఐఐసీ నిర్వాసితులు తమ న్యాయమైన డిమాండ్‌ల సాధనకు గత రెండు ధశాబ్దాలుగా చేపడుతున్న ఆందోళనలను నాయకులు, అధికారులు గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు నావన సింహాచలం అధ్యక్షత వహించగా  కొల్లి వెంకటరమణారెడ్డి, పెటి ్ల అర్జున, కె.వినోద్‌రెడ్డి, పెట్టి వెంకటరమణ, బి.అప్పారావు, దూడ పాపారావు, పి.మణిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T06:06:19+05:30 IST