సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2021-10-30T04:16:07+05:30 IST
జీవీఎంసీ 77వ వార్డు పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తెలిపారు.
ఎమ్మెల్యే అదీప్‌రాజ్
పరవాడ, అక్టోబరు 29: జీవీఎంసీ 77వ వార్డు పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన వార్డు కార్పొరేటర్ బట్టు సూర్యకుమారితో కలిసి వార్డు పరిధిలో గల పిట్టవానిపాలెం మండల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను స్థానికులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యంగా పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా ఉందని, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. త్వరలోనే మైదానం సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.