విషప్రయోగంపై డీఎస్‌పీ ఆరా
ABN , First Publish Date - 2021-05-21T04:21:17+05:30 IST
మండలంలోని మత్స్యగుండంను పాడేరు డీఎస్‌పీ రాజ్‌కమల్ గురువారం సందర్శించారు. మత్స్సగుండంలోని మత్స్యాలపై బుధవారం జరిగిన విషప్రయోగంపై ఆయన ఆరా తీశారు.

హుకుంపేట, మే 20: మండలంలోని మత్స్యగుండంను పాడేరు డీఎస్‌పీ రాజ్‌కమల్ గురువారం సందర్శించారు. మత్స్సగుండంలోని మత్స్యాలపై బుధవారం జరిగిన విషప్రయోగంపై ఆయన ఆరా తీశారు. మత్స్యాలు మృతి చెందిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సంఘటనకు సంబంధించిన వివరాలను సర్పంచ్ శాంతికుమారి, తదితరులను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై చురుగ్గా దర్యాప్తు చేస్తున్నామని, మత్స్యాల మృతికి కారకులను పట్టుకుంటామని డీఎస్‌పీ రాజ్‌కమల్ అన్నారు.