ప్రభుత్వాల తీరుతో అప్పుల ఊబిలో అన్నదాతలు

ABN , First Publish Date - 2021-10-20T06:27:31+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని సీపీఎం జిల్లా ప్రతినిధి కోటేశ్వరరావు ఆరోపించారు.

ప్రభుత్వాల తీరుతో అప్పుల ఊబిలో అన్నదాతలు
మహా సభలో మాట్లాడుతున్న కోటేశ్వరరావు

 సీపీఎం జిల్లా రెండో మహా సభలో వక్తల ధ్వజం

గొలుగొండ, అక్టోబరు 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని సీపీఎం జిల్లా ప్రతినిధి కోటేశ్వరరావు ఆరోపించారు. మండలంలోని జోగంపేట జంక్షన్‌లో మంగళవారం జరిగిన సీపీఎం జిల్లా రెండో మహా సభలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ఫలితంగా నిరుద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టలేని పరిస్ధితుల్లో ఉందన్నారు. పార్టీ మండల శాఖ కార్యదర్శి సాపిరెడ్డి నారాయణమూర్తి, జిల్లా కమిటీ సభ్యుడు డి.సత్తిబాబు, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:27:31+05:30 IST