ఆరోగ్య కేంద్రానికి కరోనా కిట్ల అందజేత

ABN , First Publish Date - 2021-05-22T04:25:20+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చొరవ మేరకు లుపిన్‌ ఫార్మా కంపెనీ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధులతో రూ.1.50 లక్షల విలువ గల పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, మందులను సమకూర్చింది.

ఆరోగ్య కేంద్రానికి కరోనా కిట్ల అందజేత
కరోనా కిట్లను ఆరోగ్య కేంద్రానికి అందజేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

పెందుర్తి రూరల్‌, మే 21: కరోనా కట్టడిలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి  అదీప్‌రాజ్‌ చొరవ మేరకు లుపిన్‌ ఫార్మా కంపెనీ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధులతో రూ.1.50 లక్షల విలువ గల పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, మందులను సమకూర్చింది. శుక్రవారం ఉదయం పెందుర్తి ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఆస్పత్రి యాజమాన్యానికి వీటిని అందజేశారు. కార్యక్రమంలో జడ్సీ చక్రవర్తి, ఎంపీడీవో మంజులవాణి, లుపిన్‌ సీఎస్‌ఆర్‌ మేనేజరు వెంకటనారాయణ,వైసీపీ నాయకులు ఎల్బీ నాయుడు, మహాలక్ష్మి నాయుడు, మెంటి మహేశ్‌, చందు, రమేశ్‌, రామరాజు, కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T04:25:20+05:30 IST