హౌసింగ్‌ రుణాలు చెల్లించొద్దు

ABN , First Publish Date - 2021-11-21T06:19:02+05:30 IST

ప్రభుత్వం గద్దెనెక్కినంతరం వీటిని రద్దు చేస్తామని చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు తెలిపారు.

హౌసింగ్‌ రుణాలు చెల్లించొద్దు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజు, బత్తుల

ఇళ్లపై సర్వహక్కులూ లబ్ధిదారులవే

టీడీపీ ప్రభుత్వంలో రుణాలు రద్దు చేస్తాం

మాజీ ఎమ్మెల్యే రాజు, నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల


బుచ్చెయ్యపేట, నవంబరు 20: హౌసింగ్‌ ఓటీఎస్‌ కింద రుణాలను ఎవరూ చెల్లించొద్దని, తమ ప్రభుత్వం గద్దెనెక్కినంతరం వీటిని రద్దు చేస్తామని చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు తెలిపారు. శనివారం వడ్డాదిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా మిగిల్చిన ఆర్థిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను, ఇప్పుడు ఓటీఎస్‌ పేరుతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తహసీల్దార్‌లు ఎల్‌పీసీలు మంజూరు చేసినంతరం, హౌసింగ్‌ శాఖ అందించిన కొద్దిపాటి డబ్బులతో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, వీటిపై సర్వ హక్కులూ లబ్ధిదారులవేనని అన్నారు. ఇప్పుడు కొత్తగా హక్కులు కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. 


ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దు

ఓటీఎస్‌ రుణం కట్టకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ప్రభుత్వం లబ్ధిదారులను బెదిరిస్తుందని, దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని రాజు, తాతయ్యబాబు అన్నారు. ఈ రుణ వసూళ్లపై జగన్‌ ప్రభుత్వం అధికారులకు రోజువారి టార్గెట్‌లు విధించడం సిగ్గుచేటన్నారు. జగనన్న కాలనీ నిర్మాణాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. లే అవుట్‌లు వేసి ఏడాదైనా సదుపాయాలు కల్పిలంచడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు దొండా నరేశ్‌, రేవళ్ల త్రినాథ్‌, దొండా గిరిబాబు, సయ్యపురెడ్డి మాధవరావు, బత్తుల కన్నబాబు, దొండా రమేశ్‌, ఏ.కనకరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T06:19:02+05:30 IST