నార సంచుల పంపిణీ

ABN , First Publish Date - 2021-10-29T04:53:25+05:30 IST

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత కృషి చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

నార సంచుల పంపిణీ
విమానాశ్రయం వద్ద నార సంచులు పంపిణీ చేస్తున్న లక్ష్మీనారాయణ

గోపాలపట్నం, అక్టోబరు 28: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత కృషి చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జేడీ ఫౌండేషన్‌ గోపాలపట్నం శాఖ ఆధ్వర్యంలో సంస్థ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఆర్థిక సాయంతో నార సంచులను ఆయన విమానాశ్రయం వద్ద స్థానికులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే పర్యావరణ సమతుల్యత అవసరమని, పర్యావరణానికి విఘాతం కలిగించి వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T04:53:25+05:30 IST