కేజీహెచ్‌కు ఏషియన్‌ పెయింట్స్‌ పరికరాల వితరణ

ABN , First Publish Date - 2021-05-19T04:11:19+05:30 IST

కేజీహెచ్‌లో కొవిడ్‌ రోగులకు వినియోగించేందుకు వీలుగా సుమారు రూ.8.5 లక్షల విలువ చేసే ఆక్సిజన్‌ సాంకేతిక పరికరాలను ఏషియన్‌ పెయింట్స్‌ అందించింది.

కేజీహెచ్‌కు ఏషియన్‌ పెయింట్స్‌  పరికరాల వితరణ
ప్రిన్సిపాల్‌కు పరికరాలు అందిస్తున్న ఏషియన్‌ పెయింట్స్‌ ప్రతినిధులు

మహారాణిపేట, మే 18: కేజీహెచ్‌లో కొవిడ్‌ రోగులకు వినియోగించేందుకు వీలుగా సుమారు రూ.8.5 లక్షల విలువ చేసే ఆక్సిజన్‌ సాంకేతిక పరికరాలను ఏషియన్‌ పెయింట్స్‌ అందించింది. మంగళవారం సంస్థ జనరల్‌ వర్క్స్‌ మేనేజర్‌  ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌కు ఈ పరికరాలను అందించారు. ఇందులో ఆక్సిజన్‌ మాస్కులు, సర్క్యూట్స్‌, బ్లడ్‌ గ్లూకోజ్‌ ఎస్టిమేషన్‌, ఏబీజీ ఎస్టిమేషన్‌ తదితర పరికరాలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-19T04:11:19+05:30 IST