అప్పన్న ట్రస్టీగా ఒకరి తొలగింపు.. మరొకరి నియామకం

ABN , First Publish Date - 2021-05-09T05:06:04+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఉన్న విజయవాడకు చెందిన వైసీపీ నేత దాడి దేవిని తొలగించి ఆమె స్థానంలో విశాఖ నగరానికి చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అప్పన్న ట్రస్టీగా ఒకరి తొలగింపు.. మరొకరి నియామకం

సింహాచలం, మే 8: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఉన్న విజయవాడకు చెందిన వైసీపీ నేత దాడి దేవిని తొలగించి ఆమె స్థానంలో విశాఖ నగరానికి చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో నూతన సభ్యురాలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా దాడి దేవి మాట్లాడుతూ సుమారు 14 నెలల పాటు సింహాద్రి అప్పన్న స్వామికి సేవ చేసుకునే భాగ్యం తనకు లభించడం ఆనందంగా ఉందని, తనను తొలగించినట్టు శనివారం సాయంత్రం వరకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదన్నారు. 

Updated Date - 2021-05-09T05:06:04+05:30 IST