విద్యుత్ సమస్య పరిష్కరించాలని ధర్నా
ABN , First Publish Date - 2021-07-25T05:20:13+05:30 IST
జీవీఎంసీ 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌లో విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మల్కాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం డీవైఎఫ్ఐ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

మల్కాపురం, జూలై 24 : జీవీఎంసీ 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌లో విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మల్కాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం డీవైఎఫ్ఐ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గత రెండు నెలలుగా క్రాంతినగర్‌లో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని, దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 83ఏ, 106ఏ, 106బీ, టీఆర్ నంబర్ 161/ఏ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఉన్న ప్రజలు విద్యుత్ అంతరాయంతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు ఎస్.వాసు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం క్రాంతినగర్ ఏరియా కార్యదర్శి వై.కల్యాణి, నాయకులు హరీశ్, రవిశంకర్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.