ఇన్సెంటివ్‌ పెంపు కోరుతూ ధర్నా

ABN , First Publish Date - 2021-12-01T05:56:08+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం ఉద్యోగులకు ఇన్సెంటివ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విభాగం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.

ఇన్సెంటివ్‌ పెంపు కోరుతూ ధర్నా
స్టీల్‌ప్లాంట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 30: స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం ఉద్యోగులకు ఇన్సెంటివ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విభాగం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాత పద్ధతిలో ఇన్సెంటివ్‌ ఇవ్వాలని, ఫర్నేస్‌లో లోపాలను సరిచేయాలని, ఫర్నేస్‌లు నిరంతరం నడిపేందుకు అవసరమైన ముడి సరకును అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మరమ్మతులు వస్తే అందుకు అవసరమైన విడిభాగాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం విభాగాధిపతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జె.రామకృష్ణ, ఎం.రవి, బాలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-01T05:56:08+05:30 IST