భైరవస్వామికి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

ABN , First Publish Date - 2021-10-07T05:48:15+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శిం చుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

భైరవస్వామికి దర్శనానికి తరలివచ్చిన భక్తులు
స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు

సింహాచలం, అక్టోబరు 6: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శిం చుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అమావాస్య సందర్భంగా వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు భైరవస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన అమృతకలశాలను మొక్కుబడులుగా సమర్పించడంతో పాటు పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం సర్వగ్రహ దోష పరిహారార్థం అనే సంకల్పంతో గుమ్మడి దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు దేవస్థానం అధికారులు అదనపు సిబ్బందిని నియ మించారు. రద్దీ పెరిగిన కారణంగా క్యూలు సుమారు కిలోమీటరు మేరకు వెళ్లడంతో స్వామివారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. 

Updated Date - 2021-10-07T05:48:15+05:30 IST