వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2021-12-31T06:24:05+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం
సిరసపల్లిలో మాట్లాడుతున్న శ్రావణ్‌కుమార్‌


మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌

పెదబయలు, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. పెదబయలు మండలం గలగండ పంచాయతీ పరిధిలో సిరసపల్లి, గసాబు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా సిరసపల్లిలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీరును ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని, భవిష్యత్తులో వైసీపీకి ప్రజలు ఓటేసే పరిస్థితి ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెచ్చంగి కొండయ్య, టీడీపీ నేతలు పాండురంగస్వామి, త్రినాథ్‌, భూషణరావు, అప్పారావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T06:24:05+05:30 IST