అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-12-31T06:25:08+05:30 IST

ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని అరకులోయ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎర్రబంద బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


అరకులోయ ఎంపీ మాధవి

కొయ్యూరు, డిసెంబరు 30: ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని అరకులోయ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. గురువారం మండలంలో పీఎంజీఎస్‌వై, ఏపీ రూరల్‌ రోడ్డు ప్రాజెక్టు నిర్మించనున్న శరభన్నపాలెం-ఎర్రబంధ, నడింపాలెం-ఎం.మాకవరం, బంగారమ్మపేట-పి.కొత్తపల్లి బీటీ రోడ్లకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే శరభన్నపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా పి.కొత్తపల్లిలో జరిగిన సమావేశంలో ఎంపీ మాధవి మాట్లాడుతూ.. గడిచిన రెండున్నరేళ్లుగా సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇక నుంచి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేశామో.. ఇకపై అభివృద్ధి అలానే చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ బడుగు రమేశ్‌బాబు, జడ్‌పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, వైస్‌ ఎంపీపీ అప్పన వెంకటరమణ, పి.కొత్తపల్లి సర్పంచ్‌ చందు, చింతపల్లి ఏఎంసీ చైర్‌పర్సన్‌ హలియారాణి, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గాడి సత్యవతి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T06:25:08+05:30 IST