జడ్పీ హైస్కూల్‌ను పరిశీలించిన డీఈవో

ABN , First Publish Date - 2021-07-13T05:19:28+05:30 IST

స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను డీఈవో బి.లింగేశ్వరరెడ్డి సోమవారం పరిశీలించారు.

జడ్పీ హైస్కూల్‌ను పరిశీలించిన డీఈవో
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో లింగేశ్వర రెడ్డి

గోపాలపట్నం, జూలై 12: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను డీఈవో బి.లింగేశ్వరరెడ్డి సోమవారం పరిశీలించారు. త్వరలో పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఏవిధంగా సిద్ధమవుతున్నారనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆయా తరగతుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్న విద్యార్థుల జాబితాను సిద్ధం చేసినట్టు డీఈవోకు ఉపాధ్యాయులు తెలిపారు. అదే విధంగా వాట్సాప్‌ గ్రూప్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌ తరగతులకు సిద్ధమవుతున్నట్టు వారు తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సంబంధించి బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం హెప్సిబా, బాలురోన్నత పాఠశాల హెచ్‌ఎం రజనీదేవిలకు డీఈవో పలు సూచనలిచ్చారు. 


Updated Date - 2021-07-13T05:19:28+05:30 IST