డీఈవో.. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
ABN , First Publish Date - 2021-11-26T06:30:29+05:30 IST
స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ను డీఈవో ఎల్.చంద్రకళ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సబ్బవరం, నవంబరు 25 : స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ను డీఈవో ఎల్.చంద్రకళ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా బాలికలతో మాట్లాడి పాఠశాలలో మౌలిక సదు పాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పదో తర గతిలో మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలని వారికి సూచించారు. కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆమె వెంట ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ మహేశ్, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.