అబ్బురపరిచిన బాలనాగమ్మ నాటకం

ABN , First Publish Date - 2021-10-29T05:50:02+05:30 IST

పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గురువారం సురభి నాటకోత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన బాలనాగమ్మ నాటకం ఆద్యంతం ఆకట్టుకుంది.

అబ్బురపరిచిన బాలనాగమ్మ నాటకం
బాలనాగమ్మను బెదిరిస్తున్న మాంత్రికుడు

మద్దిలపాలెం, అక్టోబరు 28: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గురువారం సురభి నాటకోత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన బాలనాగమ్మ నాటకం ఆద్యంతం ఆకట్టుకుంది. అడవికి వెళ్లిన బాలనాగమ్మ, అక్కచెల్లెళ్ల కష్టాలు, వారి పెళ్లిళ్లు నుంచి మాయల పకీరు వధ వరకు కళాకారులు తమ అద్భుత హావభావాలతో ఆహూతులను అబ్బురపరిచారు. బాలనాగమ్మను మోహించి ఆమెను ఎత్తుకెళ్లడం, భార్యను వెతుక్కుంటు కార్యవద్దిరాజు మాయల పకీరు కోటకు వెళ్లగా.. అక్కడ అతన్ని శిలగా మార్చిన సన్నివేశాలు రక్తి కట్టించాయి. చివరకు నాగమ్మ కుమారుడు పకీరు ప్రాణం చిలకలో ఉందని తెలుసుకుని సప్తసముద్రాలు దాటి మర్రితొర్రలోని చిలుకను తెచ్చి పకీరును అంతమొందించి తల్లిదండ్రులను విడిపించడంతో కథ సుఖాంతమైంది. రంగసాయి నాటక సంఘం నిర్వహకుడు బాదంగీర్‌ సాయి ఆధ్వర్యంలో జరి గిన ఈ నాటకాల్లో నిర్వాహకుడు రామకోటయ్య, ఉమారాణి, మురళీ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:50:02+05:30 IST