ఉదయం పూట రద్దీగా గాజువాక మార్కెట్‌

ABN , First Publish Date - 2021-05-06T05:29:18+05:30 IST

కర్ప్యూ నేపథ్యంలో గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థలకు బుధవారం ఉదయం భారీ ఎత్తున ప్రజలు చేరి సామగ్రి కొనుగోలు చేశారు.

ఉదయం పూట రద్దీగా గాజువాక  మార్కెట్‌
రద్దీగా గాజువాక ప్రధాన మార్కెట్‌

గాజువాక: కర్ప్యూ నేపథ్యంలో గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థలకు బుధవారం ఉదయం భారీ ఎత్తున ప్రజలు చేరి సామగ్రి కొనుగోలు చేశారు.  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరవడంతో వస్తువులు కొనుగోలు నిమిత్తం ప్రజలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత వ్యాపార సంస్థలు, ఇతర దుకాణాలు మూసివేయడంతో గాజువాక నిర్మానుష్యంగా మారింది. నిత్యం బిజీగా ఉండే రహదారులన్నీ బోసిపోయాయి. కీలక జంక్షన్‌లలో పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. 

Updated Date - 2021-05-06T05:29:18+05:30 IST