క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-08T06:09:12+05:30 IST

నాయుడుతోట సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మైదానంలో ప్రహ్లాదపురం యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలను ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, గండి బాబ్జి ప్రారంభించారు.

క్రికెట్‌ పోటీలు ప్రారంభం
క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు బండారు, గండి బాబ్జి

వేపగుంట, ఫిబ్రవరి 7: నాయుడుతోట సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మైదానంలో ప్రహ్లాదపురం యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలను ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, గండి బాబ్జి ప్రారంభించారు. ముందుగా గోపాలపట్నం, ప్రహ్లాదపురం, నాయుడుతోట, వేపగుంట, సింహాచలం ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి బ్యాటింగ్‌ చేయగా, బండారు సత్యనారాయణమూర్తి వికెట్‌ కీపింగ్‌ చేశారు. ఈ టోర్నమెంట్‌ ఈ నెల 17వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంట్ల పెంటారావు, రాపర్తి కన్నా, బళ్ల శ్రీను,  మామిడి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-08T06:09:12+05:30 IST