కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎడతెగని నిరీక్షణ

ABN , First Publish Date - 2021-05-09T04:33:56+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం జనం పాట్లు కొనసాగుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా టీకా మందు సరఫరా లేకపోవడంతో రోజూ వందలాది మందికి నిరాశ తప్పడం లేదు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఎడతెగని నిరీక్షణ

ఏ ఆస్పత్రి వద్ద చూసినా భారీ క్యూలు

గంటల తరబడి వేచి వున్నా అందని టీకా మందు

నిరాశగా వెనుదిరుగుతున్న జనం

ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం : కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం జనం పాట్లు కొనసాగుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా టీకా మందు సరఫరా లేకపోవడంతో రోజూ వందలాది మందికి నిరాశ తప్పడం లేదు. శనివారం రెండో డోసు వ్యాక్సిన్‌ మాత్రమే వేసినప్పటికీ ఆయా ఆస్పత్రుల వద్ద ఉదయాన్నే భారీ క్యూలు దర్శనమిచ్చాయి. రేసపువానిపాలెం వైద్య కేంద్రం వద్ద కనిపిస్తున్న ఈ క్యూలే ఇందుకు నిదర్శనం. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు క్యూలో నిల్చున్నా చాలామందికి వ్యాక్సిన్‌ అందలేదు. కొద్దిమందికి టీకా మందు వేసిన సిబ్బంది మిగిలిన వారు సోమవారం రావాలంటే చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.

Updated Date - 2021-05-09T04:33:56+05:30 IST