కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్పుచేయాలి
ABN , First Publish Date - 2021-05-21T04:18:00+05:30 IST
అక్కిరెడ్డిపాలెం, మే 20: భెల్ హెచ్‌పీవీపీ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేసి, కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్పుచేయాలని కోరుతూ భెల్ పరిరక్షణా ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం కర్మాగారం మెయిన్‌గేటు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.

అక్కిరెడ్డిపాలెం, మే 20: భెల్ హెచ్‌పీవీపీ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేసి, కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్పుచేయాలని కోరుతూ భెల్ పరిరక్షణా ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం కర్మాగారం మెయిన్‌గేటు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి జీటీపీ ప్రకాశ్ మాట్లాడుతూ ఇప్పటికే కరోనాతో తొమ్మిదిమంది కార్మికులు మృతిచెందినా యాజమాన్యం చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. యాజమాన్యం తక్షణమే టౌన్‌షిప్‌లో వున్న ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేసి తగిన వైద్యసిబ్బందిని నియమించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిరసనలో సనపల జగన్నాథరావు, కె.నారపరెడ్డి, ఎస్.అప్పారావు, జి. అచ్చిన్నాయుడు, కె.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.