కరోనా కొత్త కేసులు 68

ABN , First Publish Date - 2021-07-13T05:21:35+05:30 IST

జిల్లాలో సోమవారం కొత్తగా 68 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కరోనా కొత్త కేసులు 68

విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం కొత్తగా 68 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం 1,50,594 మంది వైరస్‌ బారినపడినట్టయ్యింది. ఇందులో 1,47,624 మంది కోలుకున్నారు. మరో 1,933 మంది చికిత్స పొందుతున్నారు. కాగా సోమవారం మరొకరు మృతిచెందడంతో...మొత్తం మరణాల సంఖ్య 1,037కు చేరింది. 


బ్లాక్‌ ఫంగస్‌తో మరొకరి మృతి


జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ బారినపడి చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 30 మందికి చేరింది. సోమవారం కొత్త కేసులు నమోదుకాలేదు. 

Updated Date - 2021-07-13T05:21:35+05:30 IST