కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-03-21T06:19:03+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఒకేరోజు 70 కేసులు నమోదు
విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 60,974కు చేరింది. ఇందులో వైరస్ నుంచి 60,200 మంది కోలుకోగా, మరో 234 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు కొవిడ్ బారినపడి 540 మంది మృతిచెందారు. కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి...మళ్లీ పెరుగుతున్నందున అప్రమత్తంగా వుండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిచెందిన తొలినాళ్లలో మాదిరిగానే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటి మార్గాలను అనుసరించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని సూచిస్తున్నారు.
6754 మందికి వ్యాక్సిన్: జిల్లాలో శనివారం 6,754 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో 6,273 మంది మొదటి డోసు తీసుకోగా, 481 మంది రెండో డోసు తీసుకున్నారు.