జనసేన నేతపై ఆగంతుకుల దాడి
ABN , First Publish Date - 2021-01-20T05:33:20+05:30 IST
జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి గాయపరిచారు.

చోడవరం, జనవరి 19: జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. శ్రీరాంపట్నం గ్రామానికి చెందిన నానాజీ పట్టణంలో నివాసం ఉంటున్నారు. సొంతూరు నుంచి ప్రతి రోజూ చోడవరంలోని ఇంటికి వచ్చి మరుసటి రోజు వెళ్తుంటారు. అలాగే సోమవారం రాత్రి పొలం పనులు ముగించుకుని వాహనంపై ఇంటికి వస్తుండగా, మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి దాడి చేయడంతో నానాజీ తల, కంటిపై గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానిక సీహెచ్‌సీలో మంగళవారం చేరారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామనని నానాజీ తెలిపారు.