పోడు భూములకు పట్టాల కోసం ఆందోళన

ABN , First Publish Date - 2021-11-02T06:09:27+05:30 IST

సాగు లోని పోడు భూములకు పట్టాలు మం జూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని వివిధ ప్రాంతాలకు చెం దిన గిరిజన రైతులు ఇక్కడి తహసీ ల్దార్‌ కార్యాలయాన్ని సోమవారం దిగ్బం ధించారు.

పోడు భూములకు పట్టాల కోసం ఆందోళన
కోటవురట్లలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని దిగ్బంధించిన గిరిజనులు


  తహసీల్దార్‌ కార్యాలయాన్ని దిగ్బంధించిన గిరిజనులు   

 అధికారులు, సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డగింత 

 ఎవరు ఎంత నచ్చజెప్పినా ఫలితం శూన్యం                                       

 రెండు, మూడు రోజుల్లో ఇస్తామని హామీ ఇవ్వడంతో విరమణ

కోటవురట్ల, నవంబరు 1 : సాగు లోని పోడు భూములకు పట్టాలు మం జూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని వివిధ ప్రాంతాలకు చెం దిన గిరిజన రైతులు ఇక్కడి తహసీ ల్దార్‌ కార్యాలయాన్ని సోమవారం దిగ్బం ధించారు. ఉదయం ఎనిమిది గంటలకే సుదూర ప్రాంతాల నుంచి గిరిజ నులు  కార్యాలయానికి చేరుకున్నారు. తహసీ ల్దార్‌తో పాటు ఇతర  ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ప్రసాదరావు, డీటీ సోమశేఖర్‌తో గిరిజనుల వాగ్వాదం జరిగింది. పట్టాలు ఇస్తేనే కార్యాలయంలోకి వెళ్లనిస్తామని  పట్టుబట్టారు. దీనిపై తహసీల్దార్‌ మాట్లా డుతూ జిల్లా కలెక్టర్‌ పట్టాలు మంజూరుకు ఆమోదం తెలిపారని, పంపిణీకి ఎమ్మెల్యేను కూడా ఆహ్వానించామని చెప్పారు. అయినప్పటికీ గిరిజనులు శాంతించ లేదు. ఎస్‌ఐ నారాయణరావు జోక్యం చేసుకుని, గిరిజనులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం తహసీల్దార్‌ రెండుమూడు రోజుల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో  ఆందోళనను విరమించారు.  సీపీఎం నాయకులు ఎం.అప్పలరాజు. డేవిడ్‌రాజుల ఆధ్వర్యంలో  ఆందోళన చేపట్టారు.

Updated Date - 2021-11-02T06:09:27+05:30 IST