నైజీరియన్‌ను కాపాడిన కమ్యూనిటీ గార్డులు

ABN , First Publish Date - 2021-10-25T05:40:41+05:30 IST

రుషికొండ బీచ్‌లో సరదాగా సముద్ర స్నానం చేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న నైజీరియన్‌కు చెందిన యువకుడిని ఆదివారం జీవీఎంసీ కమ్యూనిటీ గార్డులు కాపాడారు.

నైజీరియన్‌ను కాపాడిన కమ్యూనిటీ గార్డులు
ప్రమాదానికి గురైన నైజీరియన్‌

సాగర్‌నగర్‌, అక్టోబరు 24: రుషికొండ బీచ్‌లో సరదాగా సముద్ర స్నానం చేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న నైజీరియన్‌కు చెందిన యువకుడిని ఆదివారం జీవీఎంసీ కమ్యూనిటీ గార్డులు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. నైజీరియన్‌కు చెందిన ఇద్దరు యువకులు రుషికొండ బీచ్‌కు విహారం నిమిత్తం వచ్చారు. ఈ క్రమంలో సముద్ర స్నానాలు చేస్తున్న వీరిని పెద్ద అల బలంగా తాకింది. దీంతో ఓ నైజీరియన్‌ యువకుడు కెరటాలలో కొట్టుకుపోతుండడాన్ని సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న జీవీఎంసీ కమ్యూనిటీ గార్డులు గుర్తించి ప్రమాదం నుంచి కాపాడి ఒడ్డుకు తెచ్చారు. కాగా నైజీరియన్‌ యువకులు తమ పేర్లు వెల్లడించడానికి నిరాకరించారు.


Updated Date - 2021-10-25T05:40:41+05:30 IST