ఎమ్‌డీయూ ఆపరేటర్లకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-02-05T06:42:36+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో ఎమ్‌డీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) ఆపరేటర్లకు వీఆర్వోలు, రేషన్‌ డీలర్లు సహకరించాలని తహసీల్దార్‌ రమాదేవి సూచించారు.

ఎమ్‌డీయూ ఆపరేటర్లకు సహకరించాలి
రేషన్‌ డీలర్లు, వీఆర్వోలతో సమావేశమైన తహసీల్దార్‌ రమాదేవి

సబ్బవరం, ఫిబ్రవరి 4 : ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో ఎమ్‌డీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) ఆపరేటర్లకు వీఆర్వోలు, రేషన్‌ డీలర్లు సహకరించాలని తహసీల్దార్‌ రమాదేవి సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్‌ నుంచి 12, ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఒకటి చొప్పున రేషన్‌ తరలింపుకు వాహనాలు కేటాయించామన్నారు.  రేషన్‌ తరలింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, ఏ సమయంలోనైనా ఆదేశాలు రావచ్చని తహసీల్దార్‌ తెలిపారు. మండలంలో 29 రేషన్‌ డిపోల ద్వారా 21 వేల కార్డుదారులకు 13 వాహనాల ద్వారా రేషన్‌ అందించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ప్రజలకు సక్రమంగా రేషన్‌ పంపిణీ కార్యక్రమం విజయవంతం కావాలంటే డీలర్లు, వీఆర్వోల సహకారం తప్పనిసరన్నారు. కార్యక్రమంలో పలువురు ఆపరేటర్లు, వీఆర్వోలు, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-05T06:42:36+05:30 IST