సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి
ABN , First Publish Date - 2021-11-22T05:24:33+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు
చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలుచోట్ల ప్రదర్శనలు
మధురవాడ/కొమ్మాది, నవంబరు 21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జీవీఎంసీ 5, 6, 7, 8 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు కొమ్మాది కూడలి నుంచి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు నలుపు దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ మహిళలను గౌరవించలేని వైసీపీ నాయకులు దేవాలయం లాంటి పవిత్రమైన అసెంబ్లీని కూడా తమ మాటలతో కలుషితం చేశారన్నారు. అసెంబ్లీలో మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సీఎం క్షమాపణలు చెప్పడంతో పాటు సంబంధిత నేతలను బర్తరఫ్ చేయాలన్నారు. కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిళ్లా మంగమ్మ, మహిళా నేత బోయి రమాదేవి, తదితరులు మాట్లాడుతూ మహిళలను గౌరవించే సంస్కారం లేని వైసీపీ నేతలు మహిళా సాధికారత కోసం మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, నాయకులు పిళ్లా వెంకటరావు, నాగోతి సూర్యప్రకాశరావు, కానూరి అచ్యుతరావు, మామిడి దుర్గారావు, శ్రీరామమూర్తి వెంకట సత్యనారాయణ, పిళ్లా నరసింగరావు, వాండ్రాసి అప్పలరాజు, మొల్లి లక్ష్మణరావు, గొల్లంగి ఆనందబాబు, బోయి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
ఎంవీపీ కాలనీ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం 18వ వార్డు పరిధి అప్పుఘర్‌లో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పుఘర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షుడు గొలగాని పోలారావు, నాయకులు రామారావు, నూకరాజు, సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు. అలాగే 17వ వార్డు ఆదర్శనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశాక ఆందోళన చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షుడు కె.శంకర్‌తో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఆరిలోవ: ఆరిలోవ దుర్గాలమ్మ గుడి కూడలిలోనూ టీడీపీ 11వ వార్డు ఇన్‌చార్జి రాగతి అచ్యుతరావు ఆధ్వరంలో నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే 9, 12 వార్డుల నాయకుల ఆధ్వర్యంలో పెదగదిలి కూడలిలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు ఒమ్మి సన్యాసిరావు, బుడుమూరు గోవింద్, తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పదో వార్డు కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి, టీడీపీ వార్డు ఇన్‌చార్జి మద్దిల శేఖర్ ఆధ్వర్యంలో, 13వ వార్డు పార్టీ కార్యదర్శి ఎల్లమిల్లి సురేశ్, ధర్మారావులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గాడి సత్యం, ఒమ్మి పోలారావు, రమణి, తదితరులు పాల్గొన్నారు.
సిరిపురం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు
తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చిన్నాన్న హత్య కేసుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనన్న భయంతో వైసీపీ నేతలు భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేసి ఆ అంశాన్ని పట్టించారన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు ఒలిశెట్టి తాతాజీ, ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, లొడగల కృష్ణ, సురేశ్, టి.మోహన్, జనార్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం: ‘దేశం’ అధినేత చంద్రబాబు వెంటే మేమంతా అంటూ 98వ వార్డు నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అసెంబ్లీలో తమ నేతకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ కార్పోరేటర్ పిసిని వరాహనరసింహం, టీడీపీ వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సింహాచలం ప్రధాన కూడలిలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుయువత వార్డు అధ్యక్షుడు జి.అవినాశ్‌బాబు, బీసీ సెల్ అధ్యక్షుడు గండ్రెడ్డి వెంకటరమణ, మేకా కాసు గోపాల, పట్నాల ధర్మ, తదితరులు పాల్గొన్నారు.
విశాలాక్షినగర్: ‘తూర్పు’ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తొమ్మిదో వార్డు అధ్యక్షుడు అక్కరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో జోడుగుళ్లపాలెం కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు, బాలకృష్ణ అభిమానులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. భువనేశ్వరిపై అనుచిన వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షిం చాలన్నారు. నాయకులు చిన్నారావు, వెంకట్రావు, పాపారావు, రవి, వెంకన్నరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
