విద్యాభివృద్ధికి సీఎం పెద్దపీట

ABN , First Publish Date - 2021-01-13T05:02:25+05:30 IST

విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

విద్యాభివృద్ధికి సీఎం పెద్దపీట
అమ్మఒడి చెక్కును అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


గోపాలపట్నం, జనవరి 12: విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. అంతకు ముందు స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఇన్‌చార్జి మళ్ల విజయప్రసాద్‌, స్థానిక వైసీపీ నేతలు బెహరా భాస్కరరావు, దొడ్డి కిరణ్‌, ఆళ్ల పైడిరాజు, పలువురు మాజీ కార్పొరేటర్లు, స్కూల్‌ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T05:02:25+05:30 IST