17న నగరానికి సీఎం?

ABN , First Publish Date - 2021-12-15T06:22:58+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న నగరానికి వచ్చే అవకాశం వున్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

17న నగరానికి సీఎం?

ఉప రాష్ట్రపతి మనుమరాలి రిసెప్షన్‌కు హాజరయ్యే అవకాశం

అదేరోజు ఆయన చేతులమీదుగా పలు ప్రాజెక్టులు ప్రారంభించేందుకు జీవీఎంసీ సన్నాహాలు


విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న నగరానికి వచ్చే అవకాశం వున్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనుమరాలి వివాహం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. రిసెప్షన్‌ 17న మధురవాడలోని వి కన్వెన్షన్‌లో జరగనున్నది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే అవకాశం వుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నగరానికి వస్తే ఆయన చేతుల మీదుగా పలు ప్రాజెక్టులను ప్రారంభింపజేసేందుకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్రాజెక్టు, వుడా పార్కు ఆధునికీకరణ, మల్టీలెవెల్‌ కార్‌పార్కింగ్‌ కాంప్లెక్స్‌, పాత మునిసిపల్‌ కార్యాలయం, టౌన్‌హాల్‌ ఆధునికీకరణ పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, పూర్తయిన మాస్టర్‌ ప్లాన్‌రోడ్లను ప్రారంభించే అవకాశం వుందని అఽధికారులు పేర్కొంటున్నారు. అయితే సీఎం పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. 

Updated Date - 2021-12-15T06:22:58+05:30 IST