ముగిసిన టేబుల్‌ టెన్నిస్‌ జిల్లా జట్టు ఎంపిక పోటీలు

ABN , First Publish Date - 2021-10-19T06:11:21+05:30 IST

రైల్వే ఇండోర్‌ స్పోర్ట్సు ఎన్‌క్లేవ్‌లో జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ నిర్వహించిన జిల్లా స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ, రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపికలు సోమవారం ముగిశాయి.

ముగిసిన టేబుల్‌ టెన్నిస్‌ జిల్లా జట్టు ఎంపిక పోటీలు
విజేతలతో అతిఽథులు, జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘం ప్రతినిధులు

విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 18: రైల్వే ఇండోర్‌ స్పోర్ట్సు ఎన్‌క్లేవ్‌లో జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ నిర్వహించిన జిల్లా స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ, రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపికలు సోమవారం ముగిశాయి. ఈ పోటీలకు ఏఎంఎన్‌ఎస్‌ మేనేజర్‌(ఆపరేషన్స్‌), రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావు, షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్‌ కంపెనీ మేనేజింగ్‌ పార్టనర్‌ ఎన్‌.షణ్ముఖరావు, రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘం సంయుక్త కార్యదర్శి సూర్యారావు, జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘం కార్యదర్శి డీవీఎస్‌వై శర్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొనే పదిమంది ఆటగాళ్లతో కూడిన జిల్లా జట్టును ప్రకటించారు.

విజేతలు: బాలికల అండర్‌-19 విభాగంలో వీజీ షణ్ముఖ, అశ్విజ, ఎం.మోహిత గాయత్రి, ఎం.దీప్తి; బాలుర విభాగంలో పి.మహీధర్‌ వర్మ, పీవీ మణికుమార్‌, పి.రవివర్మ సెంథిల్‌ నాథన్‌....బాలికల అండర్‌-15 కేటగిరీలో ఎం.మోహిత గాయత్రి, టి.శ్రీసాహితి రాజ్‌, యు.రుతికశ్రీ, కె.రేణుక సత్య....బాలుర విభాగంలో పి.మహీధర్‌ వర్మ, ఆర్‌.కార్తీక్‌, అభిరామ్‌, ప్రహర్ష; అండర్‌-13 బాలికల విభాగంలో టి.శ్రీసాహితి రాజ్‌, డి.దీక్షిత, ఎస్‌కే ఆరిత సుల్తాన, కె.రేణుక సత్య...బాలుర కేటగిరీలో ఆర్‌.హితీష్‌, పి.చేతన్‌ సాయి, ఆర్‌.శుభాంకర్‌, అభిరామ్‌; అండర్‌-11 బాలికల విభాగంలో ఎస్‌.సెవితాసాయి, ఎస్‌కే ఆరిత సుల్తాన, వి.చార్వీసాయి, వి.స్నేహిత...బాలుర విభాగంలో వి.హార్ధిక్‌ రామ్‌, షాజహాన్‌ షయాన్‌, ఎస్‌కే సుల్తానా ఖాజా, ఎస్‌.గౌతమ్‌; సీనియర్‌ పురుషుల విభాగంలో పీవీ మణికుమార్‌, పి.మహీధర్‌ వర్మ, జీవీఎస్‌ రామారావు, కేఎస్‌ శ్రీహరి....మహిళల విభాగంలో వీజీ సంయుక్త, బి.హాసిని, టి.ఆశ్రిత, ఎం.మోహిత గాయత్రి తొలి నాలుగు స్థానాలలో నిలిచారు. Updated Date - 2021-10-19T06:11:21+05:30 IST