మూడు కొత్త రూట్లలో సిటీ బస్సులు

ABN , First Publish Date - 2021-08-21T05:34:37+05:30 IST

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం మూడు కొత్త రూట్లలో బస్సులు ప్రవేశపెట్టింది. 55పీ, 55ఎస్‌, 55ఆర్‌ రూట్లను గుర్తించి ఈ రూట్లలో బస్సులు నడుపుతున్నారు.

మూడు కొత్త రూట్లలో సిటీ బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, ఆగస్టు 20 : ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం మూడు కొత్త రూట్లలో బస్సులు ప్రవేశపెట్టింది. 55పీ, 55ఎస్‌,  55ఆర్‌ రూట్లను గుర్తించి ఈ రూట్లలో బస్సులు నడుపుతున్నారు. సింహాచలం - పెందుర్తి (55పీ), పెందుర్తి - సింహాచలం కొండపైకి (55ఎస్‌), సింహాచలం - దువ్వాడ రైల్వేస్టేషన్‌ (55ఆర్‌) రూట్లలో బస్సులు నడుపుతోంది. వారం రోజుల క్రితం ప్రయోగాత్మకం ఒక్కో రూట్‌లో ఒక్కో బస్సును ఆపరేట్‌ చేశారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉండడంతో శుక్రవారం నుంచి రెండేసి బస్సులు ఆపరేట్‌ చేస్తూ ఈమూడు రూట్లను పర్మినెంట్‌ చేశారు. ప్రయాణికుల డిమాండ్‌ ఉంటే మూడు రూట్లలోను బస్సుల సంఖ్య పెంచుతామని డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ సుధాబిందు తెలిపారు. 

Updated Date - 2021-08-21T05:34:37+05:30 IST