పాత నేరస్థులకు సీఐ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-11-22T04:56:00+05:30 IST

పాత నేరస్థులు నేరచరిత్ర విడనాడాలని వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ క్రైమ్‌ సీఐ లూఽథర్‌బాబు హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పాతనేరస్థులకు ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

పాత నేరస్థులకు సీఐ కౌన్సెలింగ్‌
పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న క్రైం సీఐ లూథర్‌బాబు

గోపాలపట్నం, నవంబరు 21: పాత నేరస్థులు నేరచరిత్ర విడనాడాలని వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ క్రైమ్‌ సీఐ లూఽథర్‌బాబు హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పాతనేరస్థులకు ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా లూథర్‌బాబు మాట్లాడుతూ పాతనేరస్థులు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా జీవనం సాగించాలని సూచించారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడతామని, నేరాలకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎస్‌ఐ గోవిందమ్మ, పీసీలు గణేశ్‌, మహేశ్వరి, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T04:56:00+05:30 IST