ముఖ్యమంత్రి జగన్‌ రేపు విశాఖ రాక

ABN , First Publish Date - 2021-10-22T04:17:27+05:30 IST

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23న విశాఖ వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు గురువారం ఏర్పాట్లు పరిశీలించారు.

ముఖ్యమంత్రి జగన్‌ రేపు విశాఖ రాక
ఏర్పాట్లపై చర్చిస్తున్న అధికారులు

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరు

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, అధికారులు

విశాఖపట్నం, అక్టోబరు 21: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23న విశాఖ వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, సీపీ మనీష్‌కుమార్‌సిన్హా సీఎం పర్యటించనున్న ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌, వుడా పార్క్‌, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం జరిగే ఎంజీఎం పార్క్‌ ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. వీరి వెంట జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, కమిషనర్‌ సృజన, రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులున్నారు.

Updated Date - 2021-10-22T04:17:27+05:30 IST