ఏయూ పనివేళల్లో మార్పు
ABN , First Publish Date - 2021-05-06T05:18:16+05:30 IST
కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో మేరకు బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకే పనిచేస్తుందని రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ తెలిపారు.

18 వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకే..
అత్యవసర విభాగాలు యథాతథం
ఏయూ క్యాంపస్, మే 5: కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో మేరకు బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకే పనిచేస్తుందని రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ తెలిపారు. అయితే అత్యవసర విభాగాలైన మెడికల్, విద్యుత్, శానిటరీ, సెక్యూరిటీ, వాటర్ వర్క్స్ సిబ్బంది యథావిధిగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.