విజ్ఞాన సంబరాలు గిరి విద్యార్థుల మేధస్సుకు దర్పణం

ABN , First Publish Date - 2021-12-19T05:51:55+05:30 IST

విజ్ఞాన సంబరాలు గిరిజన విద్యార్థుల్లో ఉన్న మేధస్సుకు దర్పణం పట్టాయని ఏపీ ఎస్‌టీ కమిషన్‌ చైౖర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబు అన్నారు.

విజ్ఞాన సంబరాలు గిరి విద్యార్థుల మేధస్సుకు దర్పణం
విజ్ఞాన సంబరాల్లో ప్రయోగాలను పరిశీలిస్తున్న ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు, తదితరులు


ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు 

పాడేరు, డిసెంబరు 18: విజ్ఞాన సంబరాలు గిరిజన విద్యార్థుల్లో ఉన్న మేధస్సుకు దర్పణం పట్టాయని ఏపీ ఎస్‌టీ కమిషన్‌ చైౖర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబు అన్నారు. శనివారం ఐటీడీఏ స్థాయి గిరి విజ్ఞాన సంబరాలు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఊహించిన దాని కంటే గిరిజన విద్యార్థులు అన్నిసబ్జక్టుల్లోనూ ఎంతో ప్రతిభ కనబరిచారని ప్రయోగాలను చూస్తుంటే అర్థమవుతుందన్నారు. అరకులోయ ఎంపీ జి.మాధవి మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న విద్యాలయాలకు చెందిన 978 విద్యార్థులు 426 ప్రదర్శనలు ఏర్పాటు చేశారన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు ఏర్పాటుచేసిన ప్రదర్శనలను ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు, ఎంపీ జి.మాధవి, ట్రైకార్‌ చైర్మన్‌ సతకా బుల్లిబాబు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌ తిలకించారు. అనంతరం విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో డీడీ జి.విజయకుమార్‌, ఏజెన్సీ డీఈవో పి.రమేష్‌, ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-12-19T05:51:55+05:30 IST