ఆర్టీసీలో సీసీఎస్‌ ఎన్నికల సందడి

ABN , First Publish Date - 2021-12-15T06:28:32+05:30 IST

అనకాపల్లి ఆర్టీసీ డిపోలో మంగళవారం కో-పరేటివ్‌ క్రిడెట్‌ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికల సందడి నెలకొంది.

ఆర్టీసీలో సీసీఎస్‌ ఎన్నికల సందడి
-విజయోత్సవవాలు జరుపుకుంటున్న ఎన్‌ఎంయూ కార్మికులు

డెలిగేట్స్‌గా సుధాకర్‌, శంకరరావు విజయం

ఎన్‌ఎంయూ నాయకుల విజయోత్సవాలు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 14: అనకాపల్లి ఆర్టీసీ డిపోలో మంగళవారం కో-పరేటివ్‌ క్రిడెట్‌ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికల సందడి నెలకొంది. తెల్లవారుజామున ఐదు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ అధికారి జి.అప్పారావు ఆధ్వర్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిపో మేనేజర్‌ ఎ.గిరిధర్‌కుమార్‌, ఏడీఎం రవిచంద్ర పర్యవేక్షణలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. డిపోలో 404 ఓట్లు ఉండగా 403 మంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో డెలిగేట్స్‌ పదవులకు ఎన్‌ఎంయూ తరపున పి.సుధాకర్‌, జి.శంకరరావు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ తరుపున కె.అప్పారావు, వైవీఎస్‌ కుమార్‌, స్వతంత్ర అభ్యర్థిగా బీఏ రావు తలపడ్డారు. ఆరున్నర గంటలకు ఓట్లను లెక్కించారు. ఎన్‌ఎంయూకు చెందిన పి.సుధాకర్‌కు 232 ఓట్లు, జి.శంకరరావుకు 234 ఓట్లు రావడంతో డెలిగేట్స్‌గా విజయం సాదించినట్టు అధికారులు ప్రకటించారు. కె.అప్పారావుకు 154, వైవీఎస్‌ కుమార్‌కు 171 ఓట్లు రాగా, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన బీఏ రావుకు 13 ఓట్లు పడ్డాయని డిపో మేనేజర్‌ గిరిధరకుమార్‌ తెలిపారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్‌ఎంయూ నాయకులు విజయోత్సవాలు జరుపుకున్నారు.  

Updated Date - 2021-12-15T06:28:32+05:30 IST